Saturday, October 26, 2024

వినుఁడిదె రఘుపతి - Vinudide Raghupati

వినుఁ డిదె రఘుపతి విజయములు
పనుపడి రాక్షసబాధ లుడిగెను

కులగిరు లదరెను కుంభిని వడఁకెను
యిల రాముఁడు రథమెక్కినను
కలఁగె వారిధులు కంపించె జగములు
బలువిలునమ్ములు వట్టినను

పిడుగులు దొరిగెను పెనుగాలి విసరె
తొడిఁబడి బాణము దొడిగినను
ముడివడె దిక్కులు మొగ్గె దిగ్గజములు
యెడపక రావణు నేసినను

చుక్కలు డుల్లెను స్రుక్కె భూతములు
తొక్కి యసురతల దుంచినను
గక్కన శ్రీవేంకటగిరి నిలువఁగ
అక్కజమగు శుభ మందరికొదవె

Watch for audio - https://youtu.be/HQE23QER00I 

No comments:

Post a Comment