Saturday, October 26, 2024

వేఁకునఁ దిరుపళచ్చి - Veikuna Dirupalachi

వేఁకునఁ దిరుపళచ్చి విష్ణునికిఁ జేయరో
ఆఁకటికొదగినట్టి ఆరగింపులు

అతి బ్రహ్మాండాలు గుక్షి నటు ధరించినయట్టి-
అతనికిఁ జేయరో ఆరగింపులు
ప్రతిలేని క్షీరాబ్ధిఁ బవళించి లేచినట్టి-
చతురునికిఁ జేయరో చవి నారగింపులు

యేడుదినములదాఁకా నెత్తెను గోవర్ధనము
ఆడివచ్చే బాలునికి నారగింపులు
మేడెపు గోపికలతో మిక్కిలిఁ బెనఁగినట్టి-
వేడుకకానికిఁ దేరో విందు లారగింపులు

పట్టపుదేవుళ్లుఁ దాను బంతి సాగి వున్నవాఁడు
అట్టె సేయరో పులుఁగ మారగింపులు
నెట్టన శ్రీవేంకటాద్రినిలయుఁ డారగించీని
మట్టులేక వడ్డించరో మంచి యారగింపులు

Watch for audio - https://youtu.be/Pyv8_4mgrCQ 

No comments:

Post a Comment