Saturday, October 26, 2024

ఏమి నోము నోచినదో - Emi Nomu nochinadho

ఏమి నోము నోచినదో యీయింతి
కామించి కన్నులారఁ గంటిమి మీపొందులు

చిత్తగించి నిన్నుఁజూచి సిగ్గువడీ నిదివో
కొత్తపెండ్లి కూఁతురు యీకొమ్మగాఁబోలు
మొత్తమి నీమాట విని ముసిముసినవ్వు నవ్వీ
జొత్తైనతొల్లిటినీచుట్టముగాఁ బోలును

అగపడి సరసములాడితే సమ్మతించీని
తగిన నీమేనమఱఁదలు గాఁబోలు
పగటున నీవుగప్పేపచ్చడము గప్పుకొనీ
జగమెఱఁగఁగ నీకు చనవరి గాఁబోలు

వొనరఁ బానుపుమీఁద నుండి నీపాదములొత్తీ
యెనసి వూడిగమాపె యీకె గాఁబోలు
నను నేలితివి ముందే నంటున శ్రీవేంకటేశ
నిన్నుఁ జెనకీఁ దానూ నేస్తము గాఁబోలు

Watch for audio - https://youtu.be/E_9GxEMxjrg 

No comments:

Post a Comment