వీడే నెలకొన్నాడు శ్రీవేంకటగిరి మీద
వీడే కౌరవుల పాలిటికి విశ్వరూపుడితడు
వీడే కౌరవుల పాలిటికి విశ్వరూపుడితడు
త్రిపురంబులపై వ్రాలిన యాఘన తీవ్ర బాణమితడు
చపలపు బాణుని మర్మభేదియగు చక్రధరుడితడు
విపరీతము కంబములో వెలసిన వీర సిహ్మమితడు
కపటపు భస్మాసురుని పాలిటికి కాలదండమితడు
చపలపు బాణుని మర్మభేదియగు చక్రధరుడితడు
విపరీతము కంబములో వెలసిన వీర సిహ్మమితడు
కపటపు భస్మాసురుని పాలిటికి కాలదండమితడు
ధరణి కింద బలి నణచిన యాపాతాళభేదియితడు
పరశురాముని గర్వము నణచిన ప్రళయ వాయువితడు
ఒరసిన నరకాసురుని పాలిటికి ఉరుమని పిడుగితడు
దురమున నెదిరిన దనుజకోటులకు ధూమకేతువితడు
పరశురాముని గర్వము నణచిన ప్రళయ వాయువితడు
ఒరసిన నరకాసురుని పాలిటికి ఉరుమని పిడుగితడు
దురమున నెదిరిన దనుజకోటులకు ధూమకేతువితడు
అదుగో విధిరుద్రాదుల కెల్లను ఆదిమూల మితఁడు
పదిలముగా తను గొలిచిన యాశ్రిత పారిజాతమితడు
కదలని యా బ్రహ్మాండ కోటులకు కన్నతండ్రి యితడు
వెతకి వెతకి వరము లొసంగెడి వేంకటేపతి యితడు
పదిలముగా తను గొలిచిన యాశ్రిత పారిజాతమితడు
కదలని యా బ్రహ్మాండ కోటులకు కన్నతండ్రి యితడు
వెతకి వెతకి వరము లొసంగెడి వేంకటేపతి యితడు
Watch for audio - https://youtu.be/ltQun3TUW88
No comments:
Post a Comment