ఎల్లలోకములవారి కేలిక దానే
కొల్లగా వరములిచ్చే గురుతైన దైవము
కొల్లగా వరములిచ్చే గురుతైన దైవము
కొండల కోనలలోన కోనేటి సరిదండ
మెండైన బంగారు మేడలలోన
నిండు జవ్వనము తోడి నెలఁత కౌఁగిటలోన
వుండి జగమెల్ల నేలీ నుద్దండ దైవము
మెండైన బంగారు మేడలలోన
నిండు జవ్వనము తోడి నెలఁత కౌఁగిటలోన
వుండి జగమెల్ల నేలీ నుద్దండ దైవము
నాలుగు చేతులతోడ నవ్వుల మోముతోడ
సోలి సంకుఁజక్రముల సొంపుతోడ
నేలమిన్నునొకటై నిలుచున్న రూపుతోడ
పాలుపడి మెరసీని ప్రత్యక్షదైవము
సోలి సంకుఁజక్రముల సొంపుతోడ
నేలమిన్నునొకటై నిలుచున్న రూపుతోడ
పాలుపడి మెరసీని ప్రత్యక్షదైవము
సంపదలు కడుమించి చవులతో నారగించి
జొంపపు విరుల పూజ సొంపుమించి
యింపుల శ్రీవేంకటాద్రి నిరవై వున్నాఁడు వీఁడె
పంపుడు దేవతలతోఁ బ్రతిలేని దైవము

తాత్పర్య వివరణ:
తానే (ఆ శ్రీవేంకటేశ్వరుడే) ఎల్లలోకములవారికి (చతుర్దశ భువనముల వారికి) యేలిక (ప్రభువు). ఈ దైవము కొల్లగా (విరివిగా వరములిచ్చే గురుతైన (సర్వశ్రేష్ఠుడైన) మహానుభావుడు.
కొండలు మెండుగావుండే, కోనలోన (అడవిలో) మెండైన (శ్రేష్ఠమైన) | బంగారు మేడవున్నది. దానిలో నిండు జవ్వనముతో (పూర్ణ యౌవనముతో) వున్న నెలత (మన అలిమేల్మంగ) యొక్క కౌగిటిలో నెలకొని జగమెల్లనేలే (విశ్వమునంతా పరిపాలించు) ఉద్దండదైవము (పొడవైన దేవుడు) ఈ శ్రీవేంకటేశ్వరుడే సుమా!
చతుర్భుజములతోడ చిరునవ్వులొలికే ముఖముతోడ శంఖచక్రముల | సొపుతోటి (అతిశయముతో) ఆకాశమునేల ఒక్కటై నిలిచిన రూపముతో పాలుపడి (సంప్రాప్తించి) మెరసీని (వెలుగులు విరజిమ్ము) ప్రత్యక్షదైవము ఈ శ్రీవేంకటేశ్వరుడు.
సంపదలు కడునించి అనేకమైన సిరిసంపదలు) మించినవి (అతిశయించినవి). అటుపై ఈ దేవదేవుడు చవులతోనారగించి (రుచులను ఆస్వాదించుచు భుజించినాడు.) అటు పిమ్మట, జొంపపు (నిరంతరము కొనసాగే) పుష్పపూజ ఆస్వామి అందమును ద్విగుణీకృతము చేసినది. ఈ శ్రీవేంకటేశ్వరుడు ఇంపైన శ్రీవేంకటాద్రి నివాసమైయున్నాడు. పంపుడు (ఆజ్ఞాపింపబడిన) దేవతలతో పూజింపబడుతున్న ఈ దేవుడు ప్రతిలేని (సాటిలేని) దైవము.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/x6KEGsGFwEY
No comments:
Post a Comment