Thursday, December 25, 2025

ఉయ్యాల యూఁపులు - Uyyala Voopulu

ఉయ్యాల యూఁపులు ఓ ముద్దులయ్యా 
వెయ్యారు గోపికలు వేడుక నూఁచెదరు

భోగీంద్ర తల్పుఁడా భువన విఖ్యాతా 
గోగోపరక్షకా కువలయాధీశా 
ఆగమసన్నుతా యచ్యుతానంతా 
యోగనిద్ర పోవయ్య యోగీంద్రవంద్య

దెసలందు వెలిఁగెడి దేవర్షివరులు 
ప్రసరించి బంగారు భవనంబులోన 
కొసరక నిద్రించు గోవిందా యనుచు 
పసమీర పాడెదరు పన్నగశయనా

సన్నుతించెదరయ్యా సద్భాగవతులు 
పన్నుగా శ్రీభూమి వనితలు చేరి 
ఉన్నతి పదముల నొత్తెదరు నిద్రించు 
వెన్నుఁడా ప్రసన్న వేంకటరమణా

Watch for audio - https://youtu.be/kJr6NVq_FG0 

No comments:

Post a Comment