Tuesday, December 9, 2025

మీరు సాక్షి మీరుసాక్షి- Meeru Saakshi Meeru Saakshi

మీరు సాక్షి మీరు సాక్షి మే మేమీ ననలేము
చేరి చూడరమ్మ వీని చెల్లుబడి యమ్మా

పిన్నవాఁడు నిద్ర వోఁగ పెనచి కూఁకటతోడ
పన్ని లేఁగతోఁకఁగూడ బంధించి కట్టె
వున్నతిఁ దొలఁగ వాని వొళ్లెల్లా దోఁగిపోయ
కన్నెలార యీకృష్ణుఁ గంటిరటరమ్మా

లేఁగల నన్నిటి నేము లేవక తొల్లె విడిచె
మూఁగి ఆవులుఁబేయలు మొగిఁ గలయ
ఆగి పట్టఁబోతేను అప్పుడే తా గడె వెట్టి
రాఁగతనాన నున్నాఁడు రాచబలువమ్మా

వారము సేసేమనుచు వడి నింటివారమెల్లా
కూరలు పాశాలు దొంతిఁగూడఁబెట్టితే
ఆరగించ వేలుపుల అలికి పూసి కుడిపీ
కూరిమి శ్రీవేంకటాద్రి గోవిందుఁ డమ్మా

Watch for audio - https://youtu.be/lEGdpL64xTg 

No comments:

Post a Comment