Tuesday, December 9, 2025

ఎంత కాలమైనా - Enta Kalamaina

ఎంత గాల మైనా నిట్టె యీ జీవులకు నెల్లా
పొంతనుండి కావవయ్యా పుట్టించిన దేవుఁడా

పండును సస్యము లెల్లా పరగ నేఁటేఁటన
పండదు మనసు వొకపరియైనాను
నిండును తటాకములు నెలకొన్న వానలను
నిండ దొకరి నడిగే నిరతపు నోరు

వికసించు విరు లెల్లా వెసఁ దతి వచ్చితేను
వికసించ దెంతైనా విజ్ఞానము
వొకచోట నిలుచును వొద్దికతోఁ గొండ లెల్లా
వొకచోటా నుండవు వొంటి విశ్వాములు

వస మౌను మదించిన వనగజ మైనాను
వసము గా దెంతైనా వయోమదము
యెసగ శ్రీవేంకటేశ యేలికవు నీవు మాకు
యెసగదు నీ కృపచే నిఁకఁ బూర్వకర్మము

Watch for audio - https://youtu.be/Rz-udTNfHDM 

No comments:

Post a Comment