Thursday, December 25, 2025

మదనుని తండ్రికి - Madanuni Thandriki

మదనుని తండ్రికి మజ్జనవేళ
పొదిగొనీ సింగారపు భోగములెల్లాను

పడఁతుల నవ్వులెల్లా పైనంటుకొన్నట్టు
కడలేక పొగడొందెఁ గప్పురకాపు
నిడివిఁ గల్పవృక్షము నిండాఁ బూచినట్టు
కడుఁ దెల్లనై యమరెఁ గప్పురకాపు

సుదతుల చూపులు సొరిది పైఁగప్పినట్టు
పొదిగొని జొబ్బిలీని పుణుఁగుకాపు
అదన నల్లగలువలట్టె ముంచుకొన్నట్టు
పొదలెఁ దిరుమేనను పుణుఁగుకాపు

అలమేలుమంగ వురమందుండి యనురాగము
కులికినట్టు పన్నీరుఁ గుంకుమకాపు
యెలమి శ్రీ వేంకటేశుఁడిన్ని సొమ్ములు నించుక
కొలువెల్లా నిండుకొని కుంకుమకాపు

Watch for audio - https://youtu.be/163nmuoBArs 

No comments:

Post a Comment