Tuesday, December 9, 2025

ఎపుడు వత్తువోయనుచు - Epudu Vathuvoyanuchu

ఎపుడు వత్తువోయనుచు యెదురు చూచీఁ జెలియ
వుపమించి చెప్పితిమి వువిదఁ జెందవయ్యా

నలఁతకనుగనువలకు వీమోముఁ జందురుని –
నలరంగఁ జూపగదవయ్య నేఁడు
కలికి చక్కఁదనంబు కడఁగి ప్రతిబింబించ
తళుకు నీచెక్కుటద్దములు చూపవయ్యా

నిరతి మెఇఁదీగెకును నీటాహుశాఖ లివి
అరడుగాఁ జూపఁగదవయ్య నేఁడు
సరిఁ జన్నుజక్కవలు జంటవాయకయుండ
తొరల తనుసూర్యకాంతులు చూపవయ్యా

గళనాద పికములకు కడునీజవ్వనమదము
అలమి చోటుగఁ జూపవయ్య నేఁడు
వలచి శ్రీవేంకటేశ్వర యీకెఁ గూడితివి
కలకాలమును నిటులఁ గరుణ చూపవయ్యా

Watch for audio - https://youtu.be/PZxTRyqsryM 

No comments:

Post a Comment