Saturday, August 27, 2022

తొల్లిటివలెఁగావు తుమ్మెదా - TollitivaleGavu Tummeda

తొల్లిటివలెఁ గావు తుమ్మెదా యింక
నొల్లవుగా మమ్మునో తుమ్మెదా

తోరంపు రచనల తుమ్మెదా కడుఁ
దూరేవుగొందులే తుమ్మెదా
దూరిన నెఱఁగవు తుమ్మెదా మమ్ము
నోరగఁజూడకువో వోతుమ్మెదా

తొలుప్రాయపు మిండ తుమ్మెదా కడుఁ
దొలిచేవు చేఁగలే తుమ్మెదా
తొలుకరి మెఱుఁగవే తుమ్మెదా యింక
నులికేవు మముఁగని వో వోతుమ్మెదా

దొరవు వేంకటగిరి తుమ్మెదా మా
తురు మేల చెనకేవు తుమ్మెదా
దొరకె నీచనవులు తుమ్మెదా యింక
నొరు లెఱింగిరి గదవో వోతుమ్మెదా

Watch for Audio - https://youtu.be/K15-YUpRwrk 

No comments:

Post a Comment