Saturday, August 27, 2022

నీదాఁకా వలెనా నిచ్చలు నారాయణా - Nidaka Valena Nichala Narayana

నీదాఁకా వలెనా నిచ్చలు నారాయణా
ఆది నీ దాసుఁడే చాలు నందరి రక్షించను

నీ పాదమూలమున నిలిచిన జలమును
మోపుగా మోచె రుద్రుఁడు ముందు ముందే
కాపాడు నీ నామమునఁ గలిగిన మహిమచే
పైపై మునులు యిహపరములు గనిరి

పండేటి పాలవెల్లి నీ ప్రసాదమునఁ గాదె
దండిగా దేవతలెల్ల ధన్యులైరి
అండనే నీసాకార మాతుమఁ దలఁచి కాదె
నిండిన యోగీంద్రులు నిత్యముక్తులైరి

చేరి నీవిహారమైన శ్రీవేంకటాద్రిఁ గాదె
కోరి నరులు వరాలు కొల్లగొనిరి
ఆరీతిఁ దాళ్లపాక‌ అన్నమయ్య ఘనుఁడాయ
వారివారమై నేము వహికినెక్కితిమి

Watch for Audio - https://youtu.be/0OKRP6RTbNw 

No comments:

Post a Comment