తెగఁగోయుటకు హరి దివ్య నామ కీర్తనము
వెగటు నాయుధ మిది విడువకుమీ మనసా
వెగటు నాయుధ మిది విడువకుమీ మనసా
భవపాశములచేతఁ బట్టువడ్డదేహికి
యివలఁ గర్మపాశాలు యివియుఁ గొన్నే
తవిలె నాశాపాశతతులవి యొకకొన్ని
కవగూడఁ దవిలెను కామపాశములు
యివలఁ గర్మపాశాలు యివియుఁ గొన్నే
తవిలె నాశాపాశతతులవి యొకకొన్ని
కవగూడఁ దవిలెను కామపాశములు
పమ్మి లోకపురుణానుబంధపు జీవికి
యిమ్ముల సంసారబంధా లివియుఁ గొన్నే
కమ్మరఁ బుణ్యపాపకలుషబంధాలు గొన్ని
సమ్మతించ భోగములే సకలబంధములు
యిమ్ముల సంసారబంధా లివియుఁ గొన్నే
కమ్మరఁ బుణ్యపాపకలుషబంధాలు గొన్ని
సమ్మతించ భోగములే సకలబంధములు
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నవాఁడు
జీవుఁడు నాతనిలోనే చేకొని పాయఁడు వీఁడె
భావించి కొలిచిన పాయును మాయలన్ని
దేవుఁ డితనినమ్మిన తీరుఁబో దుఃఖములు
జీవుఁడు నాతనిలోనే చేకొని పాయఁడు వీఁడె
భావించి కొలిచిన పాయును మాయలన్ని
దేవుఁ డితనినమ్మిన తీరుఁబో దుఃఖములు
భావము :
అన్నమయ్య ఈ కీర్తనలో మనస్సును ఇలా హెచ్చరిస్తున్నారు. నీ భవబంధాలను, పాపపుణ్యఫలముచేత కలుషితమయ్యే బంధాలను వదిలించుకోవాలంటే దివ్యమైన హరినామ సంకీర్తన తప్పించి మరొక దారిలేదు. ఆ బంధాలను తెగగోయాలంటే ఘోరమైన ఆయుధము ఇదే. దీనిని విడువవద్దు. భవపాశము (జన్మబంధాలు) చేతకట్టబడ్డ దేహికి, కొన్ని కర్మపాశాలు కూడా జతపడతాయి. ఆశాపాశములయొక్క సమూహములు కొన్ని అదేవిధంగా జతపడతాయి. వీటి ఫలితమా అన్నట్లు కవగూడి (జతగూడి) కామపాశము తగులుకొంటుంది. ఇదొక్కటే చాలు దేహిని భ్రష్టుని చేయటానికి. జీవికి లోకంలో ఋణానుబంధం రకరకాలుగా వుంటుంది. సంసారబంధాలు అట్టివాటిలో కొన్ని. జీవికి పాపపుణ్యాలు చేయటం సహజమే. ఆ పాపపుణ్యములు, మరికొన్ని కలుషితమైన బంధాలను కలిగిస్తాయి. జీవి ఏనాడైతే భోగములకు సమ్మతిస్తాడో అన్ని బంధాలూ యేర్పడతాయి. శ్రీవేంకటేశ్వరుడు యెల్లప్పుడూ చిత్తములోనే వుంటాడు. జీవుడు ఆయనను ఆశ్రయించియే వుంటాడు. ఈ మాయ వలన జీవికి అరిషడ్వర్గములు పీడిస్తుంటాయి. ఈమాయ తిరుమలేశుని కొలిచిన వారిని పీడించదు. దేవుడైన ఆయనను నమ్మి కొలిచిన దుఃఖములన్నీ తీరును.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/lGl2kA_MBQc
No comments:
Post a Comment