Thursday, December 25, 2025

మెచ్చితిరా నిన్ను నేను - Mechitira Ninnu Nenu

మెచ్చితిరా నిన్ను నేను మేఁటి వౌదువు
యిచ్చకురాల నైతిని యిఁకనేఁటిమాటలూ

మచ్చరముమాని నీతో మాటాడినది చాలక
కొచ్చి యంతలోనె నన్నుఁ గొంగువట్టేవు
యెచ్చి యెక్కినట్టివాని కేనుగ గుజ్జన్నమాఁట
యిచ్చట నీవల్లఁగంటి మిఁకనేఁటిమాటలు

చేయిచాఁచి నీమీఁద సేసవెట్టుట చాలక
కాయ మంటి బలిమిని కాఁగిలించేవు
చాయసందైతె చావడి చంకఁబెట్టుకొన్నమాట
యీయెడ నీయందె వున్న దిఁకనేఁటిమాటలు

కాఁకదీర నిన్ను నేను కదియుట చాలక
సోఁకనాఁడి నన్నుఁ గూడి చొక్కఁ జేసేవు
ఆఁక శ్రీవేంకటేశ పా లంటె గుటుకన్నమాట
యేఁకట నీజాడలాయ నిఁకనేఁటిమాటలు

Watch for audio - https://youtu.be/MV6mrxZ5Bo0 

No comments:

Post a Comment