వద్దు వద్దు సట లింక వామనా నీ
వద్దనే వున్నార మిదె వామనా
వద్దనే వున్నార మిదె వామనా
వరుసలు వెదకేవు వామనా నీవు
వరుఁడ విందరికిని వామనా
వరవాత వలపించి వామనా దే
వరవలె నున్నాఁడవు వామనా
వరుఁడ విందరికిని వామనా
వరవాత వలపించి వామనా దే
వరవలె నున్నాఁడవు వామనా
వనము కోగిల వైతి వామనా నీకు
వనితలు బాఁతి వామనా
వనరేరు గొల్లెతలు వామనా కా
వను వేళ చూచుకోమీ వామనా
వనితలు బాఁతి వామనా
వనరేరు గొల్లెతలు వామనా కా
వను వేళ చూచుకోమీ వామనా
వాడవారు మొక్కేరు వామనా నీకు
వాడుదేరె కెమ్మోవి వామనా
వాడికె శ్రీవేంకటాద్రివామనా
వాడేచెలమవు నీవు వామనా
వాడుదేరె కెమ్మోవి వామనా
వాడికె శ్రీవేంకటాద్రివామనా
వాడేచెలమవు నీవు వామనా
Watch for audio - https://youtu.be/xe4X9v6jjyM
No comments:
Post a Comment