Saturday, April 23, 2022

రామ రామచంద్ర రాఘవా - Rama Ramachandra Raghava

రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా
సౌమిత్రి భరతశత్రుఘ్నుల తోడ జయమందు దశరథరాఘవా

శిరసు కూఁకటులరాఘవా చిన్నారిపొన్నారిరాఘవా
గరిమ నావయసునఁ తాటకిఁ జంపినకౌసల్యనందనరాఘవా
అరిదియజ్ఞముగాచి రాఘవా అట్టె హరునివిల్లువిఱిచినరాఘవా
సిరులతో జనకునియింట జానకిఁ జెలఁగిపెండ్లాడినరాఘవా

మలయునయోధ్యారాఘవా మాయామృగాంతకరాఘవా
చెలఁగి చుప్పనాతిగర్వ మడఁచి దైత్యసేనలఁజంపినరాఘవా
సొలసి వాలిఁజంపి రాఘవా దండిసుగ్రీవునేలినరాఘవా
జలధిబంధించినరాఘవా లంకసంహరించినరాఘవా

దేవతలుచూడ రాఘవా దేవేంద్రురథమెక్కి రాఘవా
రావణాదులనుఁ జంపి విభీషణు రాజ్యమేలించిన రాఘవా
వేవేగ మరలి రాఘవా వచ్చి విజయపట్టమేలిన రాఘవా
శ్రీవేంకటగిరిమీఁద నభయములు చెలఁగి మాకిచ్చిన రాఘవ 


Watch for Audio - https://youtu.be/bdTRtO6wt-w

గొల్లెతలకేలరా - Golletala Kelara

గొల్లెతలకేలరా గోవజవ్వాది నీకు
చెల్లుఁగాక యెటువలెఁ జేసినా నన్నును

కట్టినది అంచులతొగరుఁ జీర సందిఁ
బెట్టినది మొలవంక పెద్దగాజు
మెట్టినది కంచుమట్టెల మించుమోఁత చేత-
బట్టినది చల్లచాడె పట్టకురా నన్నును

మాసినది తురుము చెమరుకంపు నే
వేసినది వెండికుప్పె వెంట్రుకదండ
వోసికొట్లు గొట్టి కంచుటుంగరాల చేయి
తీసేవు నీ చెల్లెతోడు తియ్యకురా నన్నును

ముంచినవి చెమటలు మోమునిండ కడు-
నంచినది చూడరా నావాలుఁజూపు
యెంచనేల నన్నునిట్టె యేలితివి వోరి
చెంచెతల వేడుకకాఁడ శ్రీవేంకటేశుఁడా 


Watch for Audio - https://youtu.be/v3MEfyRm650

పట్టరో వీదులఁ - Pattaro Vidhula

పట్టరో వీదులఁ బరువులువెట్టి
పుట్టుగులతో హరి పొలసీ వీఁడే

వేవేలు నేరాలు వెదకేటి దేవుఁడు
ఆవులఁ గాచీ నలవాఁడే
పోవుగ బ్రాహ్మలఁ బుట్టించు దేవుఁడు
సోవల యశోదసుతుఁడట వీఁడే

ఘనయజ్ఞములకుఁ గర్తగు దేవుఁడు
కినిసి వెన్న దొంగిలె వీఁడే
మునుల చి త్తముల మూలపుదేవుఁడు
యెనసీ గొల్లెతలయింటింట వీఁడే

నుడిగి నారదుఁడు నుతించుదేవుఁడు
బడిరోలఁ గట్టువడె వీఁడే
వుడివోనివరము లొసఁగెడు దేవుఁడు
కడఁగిన శ్రీవేంకటగిరి వీఁడే

English Lyrics - 
Pattaro vidula baruvulu vetti
Puttugulatho hari polasi veede

Vevelu neralu vedhaketi devudu
Avula gaachi nalavade
Povuga brahmala buttinchu devudu
Sovala yashodasutudata veede

Ghanayagnamulaku garthagu devudu
Kinisi venna dongile veede
Munula chittamula mulapudevudu
Yenasi gollethala intinta veede

Nudigi naaradhudu nutinchu devudu
Badirola gattuvade veede
Vudinoni varamu losagedu devudu
Kadagina srivenkatagiri veede 


Watch for Audio - https://youtu.be/MmJ6PuMCh6U

ధర్మాధర్మములాల దైవములాల - Dharma dharmamulala

ధర్మాధర్మములాల  దైవములాల 
నిర్మిత మాతడే కాని నే నేమి నెఱఁగ 

పుట్టించేటివాఁడు హరి పుట్టెడివాఁడ నేను 
నెట్టన నున్నపనులు నే నెఱఁగ 
వెట్టివాఁడ నే నింతే విష్ణుఁడు నాకేలికె 
చుట్టిననడు మంత్రాలసుద్దులూ నెఱఁగ 

లోకము దేవునిమాయ లోనైనవాఁడ నేను 
చేకొని కర్మములలో చేతలెరఁగ 
సాకిరిమాత్రము నేను సర్వజ్ఞు డాతఁడు  
దాకొని నే దలఁచేటి తలఁపూ నెఱఁగ 

అంతరాత్మ యాతఁడు ఆతనిబంట జీవుఁడ 
పంతాన నాలోపలిభావ మెరఁగ   
యింతయు శ్రీవేంకటేశుఁ డిటువంటి వాఁడ నేను 
చెంతల నానంద మిది చెప్పనేమీ నెఱఁగ 


Watch for Audio - https://youtu.be/37Ixa2DoI-g

నిలిచినచోటనెల్లా - Nilicina Chotanella

నిలిచినచోటనెల్లా నిధాన మీతఁడు
యిల వెఱవ వెఱవ నేమిటికి నిఁకను

హరి నాకుఁ గలఁడుగా అన్నిటిఁ బరిహరించ
నిరతి గర్మములెంత నిండుకుండినా
దరిదాపు ఇతఁడేకా తగ వెనుక వేసుకో
విరవిరఁ బాపాలు నా వెంటఁ బడినాను

గోవిందుఁడు గలఁడుగా కొంకుదీర్చి ననుఁగావ
కావరపు భవములు గదిమినాను
దేవుఁడితఁ డున్నాఁడుగా దిక్కుదెసై నిలుపఁగా
భావపు సంసారవార్ధి పైకొని ముంచినను

శ్రీవేంకటేశుఁడే చిత్తగించి నన్నేలెఁగా
వావాత నింద్రియాలు వళకాడినా
యీవల నావల నితఁ డిహపరా లిచ్చెఁగా
వావిరి నే దాస్యగర్వముతో నుండినను 


Watch for Audio - https://youtu.be/Wqa-RGzpFCc

ఏఁటినేను యేఁటిబుద్ధి - Etinenu Yetibuddi

ఏఁటినేను యేఁటిబుద్ధి యెక్కడిమాయ
వీటిఁబొయ్యే వెఱ్ఱిఁ గాను వివేకిఁ గాను

ఆరసి కర్మము సేసి అవి(ది?) నన్నుఁ బొదిగితే
దూరుదుఁ గర్మము గొంది దూరుచు నేను
నేరక లంపటములు నేనే కొన్నిగట్టుకొని
పేరడిఁ బరుల నందుఁ బెట్టరంటాను

యెక్కుడు నాదోషములు యెన్నైనా వుండఁగాను
వొక్కరి పాపము లెంతు వూరకే నేను
తిక్కనట్టి నాకునాకే దేవతలకెల్లా మొక్కి
వొక్కరివాఁడఁ గాకుందు వుస్సురనుకొంటాను

విరతిఁ బొందుదుఁ గొంత వేరే సంసారముఁ జేతు
యెరవులవాఁడనే యెప్పుడు నేను
అరిది శ్రీవేంకటేశుఁ డంతలో నన్ను నేలఁగా
దొరనైతి నధముఁడఁ దొల్లే నేను

English Lyrics
----------------------- 
Etinenu yeti buddhi yekkadi maya
Veetiboyye verriganu vivekiganu 

Arasi karmamu sesi avi(di?) nannu bodigithe
Durudu garmamu gondhi duruchu nenu
Neraka lampatamulu nene konnigattukoni
Peradi barulanandhu bettarantanu 

Yekkudu na doshamulu yennaina vundagaanu
Vokkari papamu lenthu voorake nenu
Tikkanatti naku nake devathalakella mokki
Vokkarivada gakundhu vussuranukontanu 

Virathi bondhudhu gontha vere samsaramu jetu
Yeravulavadane yeppudu nenu
Aridhi ShriVenkateshu danthalo nannu nelaga
Doranaiti nadhamuda dholle nenu 


Watch for Audio - https://youtu.be/4ZOQGcY7c1U

ఏమని చెప్పుదునే - Emani Cheppudune

ఏమని చెప్పుదునే వీఁడెమ్మెకాఁడు
చేముట్టి వేఁడుకొనీనే చెలిమికాఁడు

చలపాదిసరసాల జాజరకాఁడు
వలపులు చల్లీఁ బెక్కువలపుకాఁడు
తలఁపించీఁ దనపొందు దాయగాఁడు
వెలయించీ నన్ను నింత వేడుకకాఁడు

బచ్చన పరాకుల పంతగాఁడు
కొచ్చికొచ్చి చెనకీని కోడెకాఁడు
అచ్చుగా నాసరులంటీ నాసోదకాఁడు
యిచ్చటనే కాచుకున్నాఁ డెలయింపుకాఁడు

వద్దనుండే యెలయించీ వన్నెకాఁడు
ఆద్దుకొనీఁ గాఁగిట నందగాఁడు
వొద్దికై శ్రీవేంకటేశుఁ డుబ్బరికాఁడు
పెద్దరికపు లాబాల బేరగాఁడు 


Watch for Audio - https://youtu.be/q2-8YkbLDQ0

అందుకు నిందుకుఁ - Anduku Ninduku

అందుకు నిందుకుఁ బతి ఆయఁగదరా
నందకధరుఁడ నేఁడు నవ్వువచ్చీ నాకు

పిన్నదాననై బొమ్మపెండ్లి నేఁ జేయఁగాను
నన్నుఁ జూచి నీవు నాఁడే నవ్వితివిగదరా
చెన్నుగ నాకిట్టె సన్న సేసి నీవు గూడఁగాను
నన్ను నిన్నుఁ జూచి నేఁడు నవ్వు వచ్చీ నాకు

పడుచులు నేను చెట్టాపట్టాలు పట్టు కాడఁగా
నడుమనే నన్నుఁ జూచి నవ్వితివి గదరా
చిడుముడి నీవు నన్నుఁ జెట్టివట్టుకోఁగా నేఁడు
నడుకొత్తి నిన్నుఁ జూచి నవ్వువచ్చీ నాకు

పొలసి గుజ్జనఁగూళ్ల బువ్వాలాడే నన్నుఁ జూచి
నలువంక నాఁడు నీవు నవ్వితివి గదరా
యెలమి శ్రీవేంకటేశ యిటు నా మోవిబువ్వము
నలి నీ వంటి కూడఁగా నవ్వువచ్చీ నాకు 


Watch for Audio - https://youtu.be/mJGDa8krKI0

ఇందులోనే కానవద్దా - Indulone kanavadda

ఇందులోనే కానవద్దా యితడు దైవమని
విందువలె వొంటిమెట్ట వీరరఘరాముని ||

యెందు చొచ్చె బ్రహ్మ వరము  ఇల రావణుతలలు
కందువ రాఘవుడు ఖండిం చునాడు
ముందట జలధి యేమూల చొచ్చె కొండలచే
గొందిబడ గట్టివేసి కోపగించేనాడు ||

యేడనుండె మహిమలు యిందరి కితడు వచ్చి
వేడుకతో హరివిల్లు విఱిచేనాడు
వోడక యింద్రాదు లెందు నొదిగిరి యీతనిబంటు
కూడబట్టి సంజీవికొండ దెచ్చేనాడు ||

జముడెక్కడికి బోయ సరయువులో మోక్షము
అమర జీవుల కిచ్చె అల్లనాడు
తెమలి వానరులై యీదేవతలే బంట్లైరి
తిమిరి శ్రీవేంకటపతికి నేడు నాడు || 


Watch for Audio - https://youtu.be/32EeUnwqLZU

మాట లాడనేరని - Mata Ladanerani

మాట లాడనేరని రమణిఁబో నేను, నా
మాటలెల్లఁ బైఁడి వంటి మాటలే గదె

పచ్చగందని పడుచఁ బడఁతి నేను, నేఁ
డ(వ)చ్చి వేసినట్టి వనితనె కదవె
లచ్చిగొండి నీవంటినెలఁతనా నేను, యింత
పెచ్చువెరిగే వదేమె పిన్నదానవా

మిగులదళము గలమేఁటిఁబో నేను, నీ
దగునింటి ముంగిటి నిధానమంగదే
జగడాలగంప దింపుసతినా నేను, యింత
చిగురుఁగొమ్మ వదేమె చిన్నదానవా

తలపూ వాడని తరుణినే నేను, నే
నలరుఁజవికలోనియాకెనే కదే
కలికి వేంకటపతి కాంతనేనేనూ నేఁ
దొలియింతి నాకంటె దొడ్డదానవా 


Watch for Audio - https://youtu.be/AWpeF0P_MQc

దేవుఁ డొక్కఁడే మాకు - Devudokkade Maku

దేవుఁ డొక్కఁడే మాకు దిక్కుగాని
కావ నెవ్వరును లేరు కతలింతే కాని

పచ్చివొళ్లు మోచితిమి పాపమెల్లాఁ జేసితిమి
హెచ్చిన మీఁదటి సుద్దు లేఁటివో కాని
రచ్చలఁబడె మా గుట్టు రమణులచేఁత బెట్టు
అచ్చమై యిందుకుఁ బరిహరమేదో కాని

గాలిమూఁటఁ జిక్కితిమి కన్నచోటే తొక్కితిమి
ఆలించి యేమిటివారమయ్యేమో కాని
మైల గొంత మనసూ మణుఁగు గొంతానాయ
తాలిమి నా విధి యేమి దలఁచీనో కాని

మాయలఁ బొరలితిమి మరచితి మింతలోనే
చాయల శ్రీవేంకటేశు శరణంటిమి
రోయఁజొచ్చె జగమెల్లా రుచియాయ వైరాగ్య-
మాయము నాలోపలి అంతరాత్మేకాని 


Watch for Audio - https://youtu.be/zBr1158bgMc

ఏమి నెఱఁగదు బాల - Emi Neragadu Bala

ఏమి నెఱఁగదు బాల యిఁక నీచిత్తమెట్టో
మా మాటలెల్లా విని మన్నించవయ్యా

చనవు గలుగఁగాను సారె సారెఁ గొంగు వట్టి
పెనఁగీ నిదివో నీ ప్రియురాలు
యెనసి నీ వుండఁగాను ఇట్టే మందెమేళమున
మన సెరఁగ కెదురు మాటలాడీని

వొడఁబాటు గలుగఁగ నొద్దికతోడుత నీ
తొడమీఁదఁ గూచున్నది తొయ్యలి
కడు నీవు నవ్వఁగాను కన్నులఁ దప్పక చూచి
జడియక బొమ్మలను జంకించీని 

పొందులు గలుగఁగాను పొసఁగి శ్రీవేంకటేశ
అందపు రతులఁ గూడీ నతివ
కందువలు నీవంటఁగా కప్పురపుమోవి ఇచ్చి
విందులుగాఁ దమ్ములము వీడుదోడాడీని 


Watch for Audio - https://youtu.be/RLc91hL8RAA