Saturday, April 23, 2022

ధర్మాధర్మములాల దైవములాల - Dharma dharmamulala

ధర్మాధర్మములాల  దైవములాల 
నిర్మిత మాతడే కాని నే నేమి నెఱఁగ 

పుట్టించేటివాఁడు హరి పుట్టెడివాఁడ నేను 
నెట్టన నున్నపనులు నే నెఱఁగ 
వెట్టివాఁడ నే నింతే విష్ణుఁడు నాకేలికె 
చుట్టిననడు మంత్రాలసుద్దులూ నెఱఁగ 

లోకము దేవునిమాయ లోనైనవాఁడ నేను 
చేకొని కర్మములలో చేతలెరఁగ 
సాకిరిమాత్రము నేను సర్వజ్ఞు డాతఁడు  
దాకొని నే దలఁచేటి తలఁపూ నెఱఁగ 

అంతరాత్మ యాతఁడు ఆతనిబంట జీవుఁడ 
పంతాన నాలోపలిభావ మెరఁగ   
యింతయు శ్రీవేంకటేశుఁ డిటువంటి వాఁడ నేను 
చెంతల నానంద మిది చెప్పనేమీ నెఱఁగ 


Watch for Audio - https://youtu.be/37Ixa2DoI-g

No comments:

Post a Comment