Saturday, April 23, 2022

నిలిచినచోటనెల్లా - Nilicina Chotanella

నిలిచినచోటనెల్లా నిధాన మీతఁడు
యిల వెఱవ వెఱవ నేమిటికి నిఁకను

హరి నాకుఁ గలఁడుగా అన్నిటిఁ బరిహరించ
నిరతి గర్మములెంత నిండుకుండినా
దరిదాపు ఇతఁడేకా తగ వెనుక వేసుకో
విరవిరఁ బాపాలు నా వెంటఁ బడినాను

గోవిందుఁడు గలఁడుగా కొంకుదీర్చి ననుఁగావ
కావరపు భవములు గదిమినాను
దేవుఁడితఁ డున్నాఁడుగా దిక్కుదెసై నిలుపఁగా
భావపు సంసారవార్ధి పైకొని ముంచినను

శ్రీవేంకటేశుఁడే చిత్తగించి నన్నేలెఁగా
వావాత నింద్రియాలు వళకాడినా
యీవల నావల నితఁ డిహపరా లిచ్చెఁగా
వావిరి నే దాస్యగర్వముతో నుండినను 


Watch for Audio - https://youtu.be/Wqa-RGzpFCc

No comments:

Post a Comment