Saturday, April 23, 2022

మాట లాడనేరని - Mata Ladanerani

మాట లాడనేరని రమణిఁబో నేను, నా
మాటలెల్లఁ బైఁడి వంటి మాటలే గదె

పచ్చగందని పడుచఁ బడఁతి నేను, నేఁ
డ(వ)చ్చి వేసినట్టి వనితనె కదవె
లచ్చిగొండి నీవంటినెలఁతనా నేను, యింత
పెచ్చువెరిగే వదేమె పిన్నదానవా

మిగులదళము గలమేఁటిఁబో నేను, నీ
దగునింటి ముంగిటి నిధానమంగదే
జగడాలగంప దింపుసతినా నేను, యింత
చిగురుఁగొమ్మ వదేమె చిన్నదానవా

తలపూ వాడని తరుణినే నేను, నే
నలరుఁజవికలోనియాకెనే కదే
కలికి వేంకటపతి కాంతనేనేనూ నేఁ
దొలియింతి నాకంటె దొడ్డదానవా 


Watch for Audio - https://youtu.be/AWpeF0P_MQc

No comments:

Post a Comment