Saturday, April 23, 2022

ఏమి నెఱఁగదు బాల - Emi Neragadu Bala

ఏమి నెఱఁగదు బాల యిఁక నీచిత్తమెట్టో
మా మాటలెల్లా విని మన్నించవయ్యా

చనవు గలుగఁగాను సారె సారెఁ గొంగు వట్టి
పెనఁగీ నిదివో నీ ప్రియురాలు
యెనసి నీ వుండఁగాను ఇట్టే మందెమేళమున
మన సెరఁగ కెదురు మాటలాడీని

వొడఁబాటు గలుగఁగ నొద్దికతోడుత నీ
తొడమీఁదఁ గూచున్నది తొయ్యలి
కడు నీవు నవ్వఁగాను కన్నులఁ దప్పక చూచి
జడియక బొమ్మలను జంకించీని 

పొందులు గలుగఁగాను పొసఁగి శ్రీవేంకటేశ
అందపు రతులఁ గూడీ నతివ
కందువలు నీవంటఁగా కప్పురపుమోవి ఇచ్చి
విందులుగాఁ దమ్ములము వీడుదోడాడీని 


Watch for Audio - https://youtu.be/RLc91hL8RAA

No comments:

Post a Comment