Saturday, April 23, 2022

అందుకు నిందుకుఁ - Anduku Ninduku

అందుకు నిందుకుఁ బతి ఆయఁగదరా
నందకధరుఁడ నేఁడు నవ్వువచ్చీ నాకు

పిన్నదాననై బొమ్మపెండ్లి నేఁ జేయఁగాను
నన్నుఁ జూచి నీవు నాఁడే నవ్వితివిగదరా
చెన్నుగ నాకిట్టె సన్న సేసి నీవు గూడఁగాను
నన్ను నిన్నుఁ జూచి నేఁడు నవ్వు వచ్చీ నాకు

పడుచులు నేను చెట్టాపట్టాలు పట్టు కాడఁగా
నడుమనే నన్నుఁ జూచి నవ్వితివి గదరా
చిడుముడి నీవు నన్నుఁ జెట్టివట్టుకోఁగా నేఁడు
నడుకొత్తి నిన్నుఁ జూచి నవ్వువచ్చీ నాకు

పొలసి గుజ్జనఁగూళ్ల బువ్వాలాడే నన్నుఁ జూచి
నలువంక నాఁడు నీవు నవ్వితివి గదరా
యెలమి శ్రీవేంకటేశ యిటు నా మోవిబువ్వము
నలి నీ వంటి కూడఁగా నవ్వువచ్చీ నాకు 


Watch for Audio - https://youtu.be/mJGDa8krKI0

No comments:

Post a Comment