Saturday, April 23, 2022

ఏమని చెప్పుదునే - Emani Cheppudune

ఏమని చెప్పుదునే వీఁడెమ్మెకాఁడు
చేముట్టి వేఁడుకొనీనే చెలిమికాఁడు

చలపాదిసరసాల జాజరకాఁడు
వలపులు చల్లీఁ బెక్కువలపుకాఁడు
తలఁపించీఁ దనపొందు దాయగాఁడు
వెలయించీ నన్ను నింత వేడుకకాఁడు

బచ్చన పరాకుల పంతగాఁడు
కొచ్చికొచ్చి చెనకీని కోడెకాఁడు
అచ్చుగా నాసరులంటీ నాసోదకాఁడు
యిచ్చటనే కాచుకున్నాఁ డెలయింపుకాఁడు

వద్దనుండే యెలయించీ వన్నెకాఁడు
ఆద్దుకొనీఁ గాఁగిట నందగాఁడు
వొద్దికై శ్రీవేంకటేశుఁ డుబ్బరికాఁడు
పెద్దరికపు లాబాల బేరగాఁడు 


Watch for Audio - https://youtu.be/q2-8YkbLDQ0

No comments:

Post a Comment