Saturday, November 16, 2024

ఏమమ్మ యశోద - Emamma Yasoda

ఏమమ్మ యశోద మీయింటికి నేము వచ్చితే
గామువంటిబిడ్డ నిచ్చి కలుపడఁజేసితివి

పాలు గారీ సెలవులఁ బక్కునఁ జెక్కుమీఁటితే
వేలువెట్టితే లోకాలు వెల్లివిరిసీ
వీలి నేము వుగ్గువెట్ట వెరతుము మీవాఁడు
బాలుఁడా దయ్యముగాక పట్టవమ్మా

నెమ్మిఁదొడమీఁద నుండి నిలువు నూరు వండీని
పమ్మి నాల్గుమోముల పాపఁడు లోన నున్నాఁడు
నెమ్మదిఁ బాలు వోయఁగ నే వెరతు మీవాఁడు
ఇమ్ముల వీఁడు మానిశా యెవ్వఁడో కాక

పక్కన నీరార్చితిఁ బయ్యదలో నిడుకొంటి
మక్కువ నాకే తాను మగఁడైనాఁడు
చిక్కినపను లింకేమీఁ జెప్పఁగ నేవెరతును
యెక్కువ శ్రీ వేంకటేశుఁ డితఁడేపో యమ్మా 

Watch for audio - https://youtu.be/31mJCdsXMVg 

No comments:

Post a Comment