Saturday, November 16, 2024

Ade Srivenkatapathi - అదె శ్రీవేంకటపతి అలిమేలు

అదె శ్రీవేంకటపతి అలిమేలు మంగయును
కదిసివున్నారు తమకమునఁ బెండ్లికిని

బాసికములు గట్టరో పై పై దంపతులకు
శేసపాలందియ్యరో చేతులకును
సూసకాల పేరంటాండ్లు సోబానఁబాడరో
మోసపోక యిట్టే ముహూర్తమడుగరో

గక్కనను మంగళాష్టకములు చదువరో
తక్కక జేఁగట వేసి తప్పకుండాను
నిక్కి నిక్కి చూచేరదే నెరిఁ దెర దియ్యరో
వొక్కటైరి కొంగుముళ్లు వొనరఁగ వేయరో

కంకణదారములను కట్టరో యిద్దరికిని
సుంకులఁ బెండ్లిపీఁటఁ గూచుండఁ బెట్టరో
లంకె శ్రీవేంకటేశు నలమేలుమంగను దీవించి
అంకెలఁ బానుపుమీఁద నమరించరో 

Watch for audio - https://youtu.be/yiQfgq86MJI 

No comments:

Post a Comment