Saturday, November 16, 2024

హరిహరి నాబదుకు - Hari Hari Nabaduku

హరిహరి నాబదుకు ఆశ్చర్యమాయ నాకు
శరణంటి నిన్నిటికి సెలవుగా నీకును

వున్నతి జలధిఁ గలవుప్పెల్లాఁ దింటిఁగాని
యెన్నిక సుజ్ఞానమింతా నేఱఁగనైతి
దిన్నగా భూమి వేరుగ దేహములెత్తితిఁగాని
పన్నిన నాభోగకాంక్షఁ బాయఁగలేనైతిని

నాలికఁ బేలితిఁ గాని నానాభాషలెల్లా
తాలిమి హరినామము దడవనైతి
నాలిసంసారము బ్రహ్మనాఁటనుండిఁ జేసేఁగాని
మేలిమి మోక్షముతోవ మెలఁగఁగనైతిని

వూరకే దినదినాలయుగాలు దొబ్బితిఁగాని
నేరిచి వివేకము నిలుపనైతి
మేరతో శ్రీవేంకటేశ మీరే దయఁజూడఁగాను
దారదప్ప కిట్టే మీదాఁసుడ నైతిని  

Watch for audio - https://youtu.be/rqLImQ0T4zs 

No comments:

Post a Comment