Saturday, August 27, 2022

జీవాత్ముడై యుండుచిలుకా - Jeevatmudai YunduChiluka

జీవాత్ముడై యుండు చిలుకా నీ-
వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకా

ఆతుమపంజరములోన నయముననుండి నాచేతనేపెరిగిన చిలుకా
జాతిగాఁ గర్మపుసంకెళ్ళఁబడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా
భాతిగాఁ జదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా
రీతిగా దేహంపురెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా

బెదరి అయిదుగురికిని భీతిఁబొందుచుఁ గడుఁ జెదరఁగఁ జూతువే చిలుకా
అదయులయ్యిన శత్రులారుగురికిఁగాక అడిచిపడుదువే నీవు చిలుకా
వదల కిటు యాహారవాంచ నటు పదివేలు వదరులు వదరేటి చిలుకా
తుదలేని మమతలు తోరమ్ము సేసి నాతోఁగూడి మెలగిన చిలుకా

నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ జిలుకా
శ్రీవేంకటాద్రిపై చిత్తములో నుండి సేవించు కొని గట్టి చిలుకా
దైవమానుషములు తలఁపించి యెపుడు నా తలఁపునఁ బాయని చిలుకా
యేవియునునిజముగా వివియేఁటికని నాకు నెఱఁగించి నటువంటి చిలుకా 


Watch for Audio - https://youtu.be/9Wu_ICkqG5Q

No comments:

Post a Comment