Saturday, August 27, 2022

దేవతలు చెలఁగిరి - Devatalu Chelagiri

దేవతలు చెలఁగిరి దిక్కులెల్లా సంతోషించె
ఆవల నసురలెల్ల నడఁగిరి యపుడే

అందమై మధురలోన నదివో కృష్ణావతారఁ
మందెను శ్రావణబహుళాష్టమి నేఁడు
దిందుపడిరి దేవకీదేవి వసుదేవుఁడును
అందిరి బ్రహ్మనంద మంతరంగములను 

నడుమరేపల్లెలోన నందగోప యశోదల
కొడుకై పెరిగెనదే గోవిందుఁడు
అడరి గోపికలును ఆవులమందలును
వుడివోనివేడుకల నుప్పొంగఁ గలిగెను 

ఇప్పుడు శ్రీవేంకటాద్రి నిదె తిరుపతిలోన
వుప్పతిల్లి దేవుఁడై వున్నాఁడిదే
చిప్పిలి సేవకులును శ్రీసతిదేవియును
కప్పి నానాగతులఁ బొగడఁగఁ దొడఁగిరి 

Watch for Audio - https://youtu.be/hnA5HyObJmc 

No comments:

Post a Comment