Saturday, August 27, 2022

బడలి వున్నది - Badali Vunnadi

బడలి వున్నది మోము పచ్చి దేరీని
చిడిముడిఁ బన్నీరు చిత్తగించవయ్యా

విందువలె మా యింటికి విచ్చేసితి విన్నాళ్ళకు
కుందనపు  పీఁటమీఁదఁ  గూచుండవయ్యా
వొందిలి నిన్నంతేసి వుపచరించ నేరము
అందపు  నా చిలుక ప్రియము వినవయ్యా

నా మోమై నన్నుఁ జూచి నవ్వితి విన్నాళ్ళకు
కామించినా జవ్వనమేకాని కేదయ్యా
యే మనవలెనో నీతో నెఱఁగము మాటాడ
ఆమని మా మోవితేనె లారగించవయ్యా

కోరి నాపైఁ జేయి వేసి కూడితి విన్నాళ్ళకు
కేరుచుఁ జుట్టమవు మొక్కించుకోవయ్యా
యీ రీతి శ్రీ వేంకటేశ యిత వేదో తెలియము
నేరుపు నీ బుద్ధి నాకు నేఁడు గృపనయ్యా

Watch for Audio - https://youtu.be/5YmPTB73DeY

No comments:

Post a Comment