Tuesday, May 3, 2022

కొమ్మలు పదారువేల - Kommalu Padaaruvela

కొమ్మలు పదారువేలగోవిందరాజ
నిమ్మపంట వేతురా నీ వాఁటదానిని

చేరి కొంగువట్టెనంటాఁ జెలులతోఁ జెప్పి చెప్పి
ఆరీతి నవ్వుదురా ఆఁటదానిని
కోరి చెమటదీసితే కొనగోరు దాఁకెనంటా
నేరము లెన్నుదురా నీవాఁటదానిని

సన్నలఁ జిక్కించెనంటా సాకిరులు వెట్టిపెట్టి
అన్నిటా దూరుదురా ఆఁటదానిని
చన్నులుసోఁకఁగ నీసరుసఁ గూచుండెనంటా
నిన్నటికి నేఁ డందురా నీవాఁటదానిని

జట్టిగొని కూడెనంటా సముకాన మెచ్చిమెచ్చి
అట్టె పొగడుదురా ఆఁటదానిని
వొట్టుక శ్రీవేంకటేశ వుర మొక్కించుకొంటివి
నెట్టన నింతసేతురా నీ వాఁటదానిని

Watch for Audio - https://youtu.be/ao-E_U7TfiA

No comments:

Post a Comment