Tuesday, May 3, 2022

పేరు నారాయణుఁడవు - Peru Narayanudavu

పేరు నారాయణుఁడవు బెంబాడిచేఁతలు నీవి
నోరు మూసుకున్నఁ బోదు నున్ననినీసుద్దులు

వేసులు మాకుఁ జెప్పె విన భారతముగాఁగ
మోస నీపాలముచ్చిమి మొదలుగాను
రాసికెక్క శుకుఁడు రవ్వగాఁ బొగడఁ జొచ్చె
ఆసలఁ బరకాంతల నంటిననీసుద్దులు

రంతున వాల్మీకి చెప్పె రామాయణముగాను
సంతగాఁ దాటకాదులఁ జంపినదెల్లా
అంతకముందె నారదుఁడవి దండెమీటి చెప్పె
యింతటా వేఁటాడి జీవహింసలు సేసినది

వేడుక నజుఁడు చెప్పె వేదముగా నీవు దొల్లి
వోడక మీనై కొన్నాళ్లుండితివంటా
తోడనే సప్తరుషులు తొల్లియునుఁ జెప్పిరదె
యీడనే శ్రీవేంకటాద్రి నిరవైతి వనుచు 


Watch for Audio - https://youtu.be/pmrVDtju8Fk

No comments:

Post a Comment