Tuesday, May 3, 2022

ఎఱుక గలుగునాఁ - Eruka Galuguna

ఎఱుక గలుగునాఁ డెఱఁగఁడటా
మఱచినమేనితో మరి యెఱిఁగీనా

పటువైభవములఁ బరగేటినాఁడే
తటుకున శ్రీహరిఁ దలఁచఁడటా
కుటిలదేహియై కుత్తికఁ బ్రాణము
తటతటనదరఁగఁ దలఁచీనా

ఆలుబిడ్డలతో మహాసుఖ మందుచు
తాలిమితో హరిఁ దలఁచఁడటా
వాలిన కాలునివసమైనప్పుడు
దాలు వెండఁగాఁ దలఁచీనా

కొఱఁతలేక తేఁకువఁ దా నుండేటి-
తఱి వేంకటపతిఁ దలఁచఁడటా
మఱులు దేహియై మఱచివున్నయడ
తఱచుటూరుపులఁ దలఁచీనా

Watch for Audio - https://youtu.be/xZTGqvg2iBU

No comments:

Post a Comment