Tuesday, May 3, 2022

నన్ను నింతగా - Nannu Nintaga

నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ
అన్నిటా రక్షించకపో దంతర్యామి

సొమ్మువో వేసినవాఁడు చుట్టిచుట్టి వీథులెల్లా
కమ్ముక వెదకీనట కన్నదాఁకాను
నమ్మిన అజ్ఞానములో నన్నుఁ బడవేసుకొని
అమ్మరో వూరకుందురా అంతర్యామి

వోడ బేరమాడేవాఁడు వొకదరి చేరిచి
కూడిన యర్థము గాచుకొనీనట
యీడనే ప్రపంచములో నిట్టె నన్ను దరిచేర్చి
వోడక కాచుకోరాదా వోయంతర్యామి

చేరి వుప్పమ్మేవాఁడు చిట్లు వేఁ గనఁడట
వూరకే శ్రీవేంకటేశ వోపికతోడ
ఆరయ నన్నుఁ బుట్టించినట్టివాఁడవు నాభార-
మేరీతినైన మోపు మిఁక సంతర్యామి 

Watch for Audio - https://youtu.be/M5rheKYLET0

No comments:

Post a Comment