Monday, May 16, 2022

ఎటువంటి మోహమో - Etuvanti Mohamo

ఎటువంటి మోహమో యీపెకు నాతని మీఁద
ఘటియించె నిద్దరికి కందువ వేడుకలు

సంగడిఁ గూచున్నది చనవు చేకొన్నది
అంగపుఁ జెమట నోల లాడినది
యెంగిలిపొత్తున విడే లిచ్చినది మెచ్చినది
పంగించీ నిందిరాదేవి ప్రహ్లాదవరదుని

మొక్కుచు నవ్వినది ముచ్చట లాడినది
యిక్కువ లంటుచు లోలో నెన సున్నది
చెక్కుఁ జెక్కుఁ గదియించి జిగిఁ బులకించినది
చిక్కించీఁ గమలాదేవి శ్రీనరసింహునిని

కనుసన్న చేసినది కాఁగిట నించినది
తనివార రతులను దక్కఁ గొన్నది
చెనకి యహోబలాన శ్రీవేంకటాద్రి మీఁద
ననిచె శ్రీమహాలక్ష్మీ నరమృగదేవుని

Watch for Audio - https://youtu.be/a5s1vSu_EGI

No comments:

Post a Comment