Monday, May 16, 2022

నీమాయ కల్లగాదు - Ni Maya Kallagadu

నీమాయ కల్లగాదు నిజము దెలియరాదు
కామించి హరి నీ వొక్కఁడవే నిజము

చచ్చేటి దొకమాయ సరిఁ బుట్టేదొకమాయ
మచ్చుమేపులసిరులు మాయలో మాయ
వచ్చేటి దొకమాయ వచ్చిపోయ్యే దొకమాయ
కచ్చుపెట్టి హరి నీ వొక్కఁడవే నిజము

పొద్దువొడచేది మాయ పొద్దుగుంకే దొకమాయ
నిద్దురయు మేల్కనేది నిండుమాయ
వొద్దనే సుఖము మాయ వొగి దుఃఖ మొకమాయ
గద్దరిశ్రీహరి నీ వొక్కఁడవే నిజము

కూడేటి దొకమాయ కూడి పాసే దొకమాయ
యేడ నేర్చితి శ్రీవేంకటేశుఁడ నీవు
వేడుక నీశరణంటి విడిపించు మీమాయ
వోడక వెదకితి నీ వొక్కఁడవే నిజము


Watch for Audio -  https://youtu.be/mSaq-dNv2ao

No comments:

Post a Comment