Monday, May 16, 2022

ఎక్కడి దురవస్థ - Ekkadi Duravasta

ఎక్కడి దురవస్థ లేఁటిదేహము లోనఁ
జిక్కి జీవుఁడు మోక్షసిరిఁ జెందలేఁడు

ఒడలు మంసపూర మొక పూఁటయిన మీఁదు
గడుగకున్నఁ గొరగాదు
కడలేనిమలమూత్రగర్హిత మిది, లోను
గడుగరాదు యెంతగడిగినఁ బోదు

అలర చిత్తము చూడ నతిచంచలము దీనఁ
గలసిన పెనుగాలి గనము
మెలుపులేనిచిచ్చు మీఁదమిక్కిలిఁ గొంత
నిలుపు లేదు పట్టి నిలుపఁగరాదు

తిరువేంకటాచలాధిపుఁడు నిత్యానంద-
కరుఁడు జీవునకు రక్షకుఁడు
కరుణించి యొకవేళఁ గాచినఁగాని మేను-
చొరకమానెడుబుద్ది చోఁక దెవ్వరికి


Watch for Audio - https://youtu.be/V9sJnlThyts

No comments:

Post a Comment