ఎంత చదివిన నేమివినిన తన-
చింత యేల మాను సిరులేల కలుగు
చింత యేల మాను సిరులేల కలుగు
ఇతర దూషణములు యెడసినఁగాక
అతికాముకుఁడుగాని యప్పుడు గాక
మతిచంచలము గొంత మానినఁగాక
గతి యేల కలుగు దుర్గతులేల మాను
అతికాముకుఁడుగాని యప్పుడు గాక
మతిచంచలము గొంత మానినఁగాక
గతి యేల కలుగు దుర్గతులేల మాను
పరధనములయాస పాసినఁగాక
అరిదినిందలులేనియప్పుడు గాక
విరసవర్తనము విడిచినఁగాక
పరమేల కలుగు నాపదలేల మాను
అరిదినిందలులేనియప్పుడు గాక
విరసవర్తనము విడిచినఁగాక
పరమేల కలుగు నాపదలేల మాను
వేంకటపతి నాత్మ వెదకినఁగాక
కింక మనసునఁ దొలఁగినఁగాక
బొంకుమాట లెడసిపోయినఁగాక
శంకయేల మాను జయమేల కలుగు
కింక మనసునఁ దొలఁగినఁగాక
బొంకుమాట లెడసిపోయినఁగాక
శంకయేల మాను జయమేల కలుగు
భావము -
( శ్రీ తాడేపల్లి పతంజలి గారు)
చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన అది కావాలి - ఇది కావాలి అనే నీ చింత పోదు. నీకు భగవద్గీతలో చెప్పిన దైవీసంపద రాదు..
1. ముందు నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో, ఇతరులతో దూషణ వాక్యాలు మానేయ్! కోరిక ఉండటంలో తప్పులేదు. అతి కోరికలు వదిలేయ్! చంచలత్వం ఆలోచనల్లో కొంతయినా వదలటానికి ప్రయత్నించు. అలా నీ ప్రవర్తనని మార్చుకోపోతే నీకు అతీగతీ లేదు. నీ బతుకంతా నరకమే (దుర్గతి).
2. ఇతరుల ధనం మీద ఆశ పడకు, భరించటానికి వీల్లేని (అరిది) నిందలు ఇతరుల మీద వేయకు. ఆవిధంగా నీ నడత ఉండకూడదు. ఎప్పుడూ తగాదాలాడే మనస్తత్వం వదిలేయ్! ఈ విధంగా ఉండకపోయావో నీకు మోక్షం రాదు. ఆపదలు పోవు.
3. శ్రీవేంకటేశ్వరుడిని ఆత్మలో తెలుసుకో! కోపాన్ని మనస్సులో పోగొట్టుకో, అబద్ధాలాడటం మానేయ్! ఇలా చేయకపోయావో నీకు జన్మ జన్మలనుంచి వస్తున్న సందేహాలు తొలగిపోవు. జయం కలగదు.

Watch for audio - https://youtu.be/aZ1fn8LWh9k
No comments:
Post a Comment