Friday, November 17, 2023

నీకు నేల తమకము - Niku Nela Tamakamu

నీకు నేల తమకము నీకు అలపు నేఁడు
నీకు వాఁడు మోహించి నీలోనె యుండఁగా

తొడవుగాఁ గమ్మని కస్తురిఁ బొట్టుగాఁబెట్టి
జెడలల్లి జవ్వాది శిరసుపై నంటి
విడువని విరహపు వెచ్చ మేన దైవాఱ
నిడువాలుఁ గనుదోయి నీరు నించ నేఁటికి

కొత్త ముత్యపు సరుల కుచ్చులు వీపున వ్రేల
నొత్తిలి చెక్కునఁ గర మూఁది మోమువంచి
లత్తుక మోవి గదల లలన నీచిన్నయెలుఁ
గెత్తి ప్రేమ దైవాఱ నెవ్వరిఁ బాడెదవే

కొండలరాయఁడు వాఁడు కోనేటితిమ్మఁడు నీ
నిండిన చిత్తములోన నీవు దానై యుండఁగాఁ
గొండగొన్న సుఖమెల్లఁ గొల్లలాడుదువుగాక
బొండుమల్లె పానుపుపై బొరలఁగ నేఁటికే 


No comments:

Post a Comment