Friday, November 17, 2023

అనుమానపు బ్రదుకది - Anumanapu Bradukadi

అనుమానపుబ్రదు కది రోఁతా తన
మనసెనయనికూటమి మరి రోఁతా

అపకీర్తులఁబడి ఆడికెలోనై
అపవాదియౌట అదిరోఁత
వుపమ గెలిచేనని వొరుఁ జెరుచుటలు
విపరీతపుగుణవిధ మొకరోఁతా

తనగుట్టెల్లా నెరిఁగినవారలముందట
తనయెమ్మెలు చెప్పుకొనుట రోఁత
వనితలముందట వదరుచు వదరుచు
కనుఁగవ గాననిగర్వము రోఁత

భువి హరి గతియని బుద్ధిఁదలంచని-
యవమానపుమన సది రోఁత
భవసంహరుఁడై పరగువేంకటపతి-
నవిరళముగఁ గొలువని దది రోఁత 


No comments:

Post a Comment