Saturday, July 29, 2023

విచారించుకోరో - Vicharinchukoro

విచారించుకోరో యిది వివేకులాల మెండు-
పచారాలు చూచి మీరు భ్రమయకురో

భావింప నారదునికి బ్రహ్మపట్ట మరుదా
వేవేలైనాఁ గొంచెమని విడిచెఁగాక
దేవతలు తన్నుఁ జూచి దిగ్గన లేచి మొక్కేటి-
ఆవైభవపు పదమందెఁ గాక

మిక్కిలి జ్ఞానము గల్గి మించి తమ నేరుపెల్లా
చిక్కి సంసారము పాలు సేయవలెనా
యెక్కువ హరిదాసుఁడై యిట్లానే వైకుంఠ-
మెక్కెడితోవ సాధించేదిది మేలుఁ గాక

మూలమని నుడిగితే ముంచి యెవ్వఁడు గాచెను
పోలించ నెవ్వని నాభిఁ బుట్టె లోకాలు
చాలి యెవ్వనికుక్షి నీజగము లున్నవి మరి
కాలమందే ఆదేవునిఁ గానవలెఁ గాక

యిదియే శ్రీవైష్ణవులు యిలఁ బూర్వాచార్యులు
వెదకి చదివి కన్నవివరమెల్లా
తుదమొద లెరఁగని దుష్టులకతలు మాని
పదిలమై యిట్టే నమ్మి బ్రదుకుటఁ గాక

సంకుఁజక్రములు మా (నూ?)ని సమానభోగముతోడ
అంకెల శ్రీవేంకటేశునండ నుండరో
పొంకపుబుద్ధు లిమ్మని పొంచి గాయత్రి జపించి
ఇంక బ్రహ్మవేత్త లెంచేదిందుకే కాక 


No comments:

Post a Comment