Thursday, October 20, 2022

సత్యము సేయఁగవచ్చును - Satyamu Seyagavachunu

సత్యము సేయఁగవచ్చును సర్వేశ్వర యీమాటకు
నిత్యము నీవే యెఱుఁగుదు నేనేమి నెఱఁగఁ జుమీ

సులభుఁడవౌదువు వొకమరి చూడఁగ దుర్లభుఁడవౌదువు
తలఁపింతువు మఱపింతువు తగఁ బ్రాణములోనుండి
పలికింతువు అక్షరముల పరగ నవే వ్రాయింతువు
వెలయఁగ నీవే వెలిగా వేరొకటి నేఁ జేయఁ జుమీ

వొనరఁగఁబూజలు గొందువు వొక్కొకపరిమానుదు వటు
కను మూయింతువు నిదురలఁ గడు మేల్కొలుపుదువు
ఘనముగ నజ్ఞానిఁ జేతువు కరుణతో జ్ఞానిఁ జేతువు
ననుఁ బుట్టించితి నీవే నా కాపని గాదు సుమీ

నాలో నుందువు వొకపరి నగి శ్రీవేంకటగిరి నుందువు
పాలింతువు లాలింతువు భవ మీడేరింతువు
పోలింప సంసారిఁ జేతువు భువి నీదాసునిఁ జేతువు
కాలముఁ గర్మము నీవే కపటము నే నేరఁ జుమీ 


Watch for Audio - https://youtu.be/P2n9gxF7HAE

No comments:

Post a Comment