Thursday, October 20, 2022

సత్యభామ సరసపు - Satyabhama Sarasapu

సత్యభామ సరసపు నగవు
నిత్యము హరిమదినే నెలవాయ

రుకుమిణిదేవికి రూపయవ్వనికి
సకల విభవముల సౌఖ్యతలు
చికురాంబరమునఁ జెదరిన యలకలు
వికచాబ్జముఖము వెయివేలాయ

తొడవుల శ్రీసతి తొలుమెఱుఁగులమై
నడపుల మురిపెపు నగుమోము
తడయక వారిధి దచ్చిన హరికిని
బడలిక వాపను పరమంబాయ

అనుదినమును నీ యలమేలుమంగ
కనుఁగవ జంకెన గర్వములు
దినదినంబులును తిరువేంకటపతి-
చనవుల సొబగుల సంపదలాయ 


Watch for Audio - https://youtu.be/hbF2ac4OfQE

No comments:

Post a Comment