Saturday, November 23, 2024

తెలిసినవారి కింతా - Telisinavari Kinta

తెలిసినవారి కింతా దేవుఁడై యుండు
కలఁడన్నచోట హరి గలఁ డటుగాన

అందునిందుఁ బోయి శ్రీహరిని వెదకనేల
బొందితోడి రూపులెల్లాఁ బొరి నతఁడే
కొందరిలోనుండి ఇచ్చుఁ గోరినట్టి యీవులెల్ల
కొందరిలో మాటలాడుఁ గొందరిలో నగును

లోన వెలిఁ జూచి పరలోకము వెదకనేల
యేనెలవైన వైకుంఠ మెదుట నదె
పూని వొకచోట నెండ పొడచూపు నక్కడనే
నానినవెన్నెల గాసు నానారీతులౌను

చొక్కిచొక్కి యానందసుఖము వెదకనేల
మక్కువఁ దా శాంతుఁడైతే మతిలో నదె
యెక్కువతో శ్రీవేంకటేశ్వరుదాఁసుడ నైతి
వొక్కఁడే మాకిన్నిటికిఁ నొడయఁడై నిలిచె

Watch for audio - https://youtu.be/CzIQk7u6YOU 

No comments:

Post a Comment