పండియుఁ బండదు చిత్తము పరిభవ మెడయదు కాంక్షల
యెండలనే కాఁగితి మిఁక నేలాగోకాని
యెండలనే కాఁగితి మిఁక నేలాగోకాని
పదిగోట్లుజన్మంబులఁ బాయనికర్మపుఁ బాట్లు
వదలక వొక నిమిషములో వడిఁదీరుచు నితఁడు
చెదరని నిజదాసులకును శ్రీహరి, మా కిపుడంతక
హృదయము నిలువదు చంచల మేలాగోకాని
వదలక వొక నిమిషములో వడిఁదీరుచు నితఁడు
చెదరని నిజదాసులకును శ్రీహరి, మా కిపుడంతక
హృదయము నిలువదు చంచల మేలాగోకాని
కూపపు బహునరకంబుల కోట్లసంఖ్యలఁ బొరలేటి-
పాపము లొకనిమిషములోఁ బాపఁగఁగలఁ డితఁడు
కాపాడఁగఁ దలచిన యీకమలాపతి, నే మీతని-
యేపునఁ గని మనలే మిఁక నేలాగోకాని
పాపము లొకనిమిషములోఁ బాపఁగఁగలఁ డితఁడు
కాపాడఁగఁ దలచిన యీకమలాపతి, నే మీతని-
యేపునఁ గని మనలే మిఁక నేలాగోకాని
జడిగొని యెన్నఁడు బాయనిసంసారపుబంధంబుల
విడుమని వొకనిమిషములో విడిపించును యితఁడు
కడుఁగొలిచినవారికి వేంకటపతి, నే మీతని-
నెడయక కొలువఁగలేమిఁక నేలాగోకాని
విడుమని వొకనిమిషములో విడిపించును యితఁడు
కడుఁగొలిచినవారికి వేంకటపతి, నే మీతని-
నెడయక కొలువఁగలేమిఁక నేలాగోకాని
Watch for audio - https://youtu.be/rjixBUw93Gs
No comments:
Post a Comment