సకలలోకనాధుడు జనార్థునుఁ డితఁడు
శుకయొగివంద్యునిసుజ్ఞాన మెంత
శుకయొగివంద్యునిసుజ్ఞాన మెంత
మరునితండ్రికిని మఱి చక్కదనమెంత
సిరిమగనిభాగ్యము చెప్ప నెంత
పురుషోత్తముఘనత పొగడఁగ నిఁక నెంత
గరిమ జలధిశాయి గంభీర మెంత
సిరిమగనిభాగ్యము చెప్ప నెంత
పురుషోత్తముఘనత పొగడఁగ నిఁక నెంత
గరిమ జలధిశాయి గంభీర మెంత
వేవేలు ముఖాలవానివిగ్రహము చెప్ప నెంత
భూవల్లభునివోరుపు పోలించ నెంత
వావిరి బ్రహ్మతండ్రికి వర్ణింప రాజస మెంత
యేవల్ల జక్రాయుధుని కెదురెంచ నెంత
భూవల్లభునివోరుపు పోలించ నెంత
వావిరి బ్రహ్మతండ్రికి వర్ణింప రాజస మెంత
యేవల్ల జక్రాయుధుని కెదురెంచ నెంత
అమితవరదునకు ఔదర్యగుణ మెంత
విమతాసురవై రివిక్రమ మెంత
మమతల నలమేలుమంగపతిసొబ గెంత
అమర శ్రీవేంకటేశుఆధిక్య మెంత
విమతాసురవై రివిక్రమ మెంత
మమతల నలమేలుమంగపతిసొబ గెంత
అమర శ్రీవేంకటేశుఆధిక్య మెంత
Watch for audio - https://youtu.be/I-zNGT-Y_QY
No comments:
Post a Comment