Tuesday, September 19, 2023

వేంకటాద్రివిభునిఁబాసి - Venkatadri Vibhunibasi

వేంకటాద్రివిభునిఁబాసి విరహియైన రమణిఁ జూచి
రంకెలు వేయనేఁటికమ్మ రాజసమునను

విసపు కోర సోఁకినపుడె వేఁడిలేని చందమామ
మిసిమిగలుగు వేఁడిచూపు మింట మలయునే
నొసలికంటికాఁకనణఁగి నొగిలినపుడె తొడుగలేక
కుసుమశరము మదనుఁడతివకొరకు దాఁచెనే

చిగురుమేఁతకాండ్లెల్ల చెలఁగి మావికొమ్మలెక్కిఁ
మగువమీఁదఁగూఁతరేఁచి మరునిఁగూడిరే
తగవరైన దశరధేంద్రుతనయు శాపమొసఁగినపుడె
తెగువమీఁదఁగూఁతరేఁచ తెరఁగులెరఁగరా

నెయ్యమలర మంచివిరులశయ్య వేంకటాద్రివిభుఁడు
లియ్యమైనచెలికిఁ జనవులియ్యఁదొణఁ గెనే
కుయ్యవెరచెఁ గోవిలలును కుంకెఁ జందమామకళలు
తియ్యవింటివాఁడు వెనకతియ్యఁదొడఁగెనే 


No comments:

Post a Comment