Wednesday, October 26, 2022

ప్రత్యక్షమే మాకుఁ - Pratyakshame Maku

ప్రత్యక్షమే మాకుఁ బ్రమాణము
సత్యరూప జోలిదవ్వి జాలిఁబడ నోపము

కన్న వారెవ్వరు నిన్ను కన్నుల యెదుటను
పన్ని నీదాసులు చూచే భావమువలె
విన్న వారెవ్వరు నీవిభవపు మాటలు
అన్నిటా నాచార్యుని యానతివలె

తొడఁగి నీ ప్రసాదము దొరకిన వారెవ్వరు
జడియు నీ దాసుల ప్రసాదమువలె
కడు నీ పాదతీర్థము కడగన్నవారెవ్వరు
బడిబడి నీ భక్తపాదజలమువలె

యేచి పరంధామమున కేఁగిన వారెవ్వరు
చాచిన నీ దాసుల సన్నిధివలె
చూచితి శ్రీవేంకటేశ సొంపుల నీ మహిమెల్ల
తాచిన నీ దాసానుదాసులయందే 


Watch for Audio - https://youtu.be/qnGyijEItOs 

No comments:

Post a Comment