Saturday, October 29, 2022

నీ మహిమ వల్లనే - Ni Mahima Vallane

నీ మహిమ వల్లనే నే బదికే దెల్లాను
వేమరు నా కేల యింక వేసరించ నిన్నును

ఆముకొని నిన్నుఁబాసి అట్టే విరహాన నున్నా
నీ మీఁది మోహమే నన్ను నెరవేర్చును
భామలపై నీవు గొంత పరాకై వుండినాను
నేమపు నీపై తలఁపే నిన్నుఁదెచ్చి యిచ్చును

యిట్టే నీ కెదురు చూచి యెంత కాఁకఁ బొందినాను
జట్టిగ నీపై యాస చల్లఁజేసును
గుట్టున నేవనితలఁ గూడి నీవుండినాను
చుట్టపు నీసుద్దులే సొంపులు వుట్టించును

సేసవెట్టి ఇప్పుడెంత సిగ్గుతో నే నుండినాను
రాసి కెక్క నీ కౌఁగిలే రవ్వ సేసును
యీసరి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
వేసరని నీ రతులే వేడుకలు రేఁచునూ 


Watch for Audio -  https://youtu.be/vw1qGjKM5TY 

No comments:

Post a Comment