Saturday, October 29, 2022

కొమ్మకడకు విచ్చేసి - Kommakadaku Vichesi

కొమ్మకడకు విచ్చేసి కోరినవరమీరాదా
యెమ్మెల మానసతపమీకె చేసీని

వెన్నెలయెండలలోన విరహతాపానఁ జెలి
పన్ని మిక్కుటమైన తపము చేసీని
చెన్నుమీరఁ బరచిన చిగురుఁగత్తులమీఁద
యెన్నరాని వుగ్రతపమిదె చేసీని

మొనసి చెమటఁ దలమునుకల నీటిలోన
పనివడి నీకుఁ దపము చేసీని
ఘనమైన నిట్టూరుపు గాలి లోనఁ జెలించక
యెనలేని ఘెరతపమిదె చేసీని

బాయిటనె తనమేని పచ్చిజవ్వనవనాన
పాయక నీరతికిఁ దపము చేసీని
నీయింట శ్రీ వెంకటేశ నిన్నుఁగూడెలమేల్మంగ
యీయెడ మోహనతపమిదె చేసీని 


Watch for Audio -  https://youtu.be/ydNU3uajcHc 

No comments:

Post a Comment