Saturday, August 27, 2022

చూడరమ్మ చెలులార - Cudaramma Celulara

చూడరమ్మ చెలులార జూటితఁడు
యీడుజోడై వినయాలు యెంత సేసీ నితఁడు

సన్నల సారెసారె సాగిలి నే మొక్కఁగాను
యెన్నేసి నవ్వులు నవ్వీ నితఁడు
కన్నులఁ దప్పక నేను కాఁగిలించి చూడఁగాను
వున్నతి తానేల లోఁగీ వూరకైనా నితఁడు

కూరిమి నిలుచుండి నే కొలువులు సేయఁగాను
యీరీతి చెఱఁగువట్టీ యీతఁడు
తారుకాణలైనట్టు తన్ను నేనే పాడఁగాను
ఆరిసి తా చెక్కునొక్కీ నంతలోనే యీతఁడు

చింతదీర తనకు నే సేవలెల్లాఁ జేయఁగాను
యింతలోనే కాఁగిలించీ నితఁడు
అంతటి శ్రీ వేంకటేశుఁడని నే తన్నుఁ గూడితి
సంతోసములెల్లా రేఁచి చనవిచ్చీ నితఁడు 

Watch for Audio - https://youtu.be/toFWhNlA9Ac 

No comments:

Post a Comment