Tuesday, May 3, 2022

తనువులో దైవము - Tanuvulo Daivamu

తనువులో దైవము దయదలఁచు టెప్పుడో
తనివోనితమకాన తడఁబాటు లివిగో

చెక్కునొక్కి చెలిమీఁద చేయివేసి సారె సారె
మక్కళించి మక్కళించి మాటాడు టెపుడో
మొక్కుఁచు గన్నుల నట్టె ముచ్చట దీరఁగ లో లో
చిక్కనినవ్వులు నవ్వి చెలఁగుట యెన్నఁడో

మోము చూచి సన్న చేసి మోహములు చల్లి చల్లి
నామువారఁ జొక్కేటినను పెప్పుడో
దీమసపుఁ గోరికలు దిష్టముగాఁ గొనసాగ
ఆమని సరసములు ఆడుట యెన్నఁడొకొ

కాఁగిటిరతులలో కరఁగించి మానినికి
మాఁగినమోవియిచ్చేమన్న నెప్పుడో
దాఁగక ఇంతటిలోనే తరుణి యేతెంచి కూడె
సాఁగి శ్రీవేంకటేశ పంతము లిఁకెన్నఁడో 

Watch for Audio - https://youtu.be/vEhQ1nBtD8M

No comments:

Post a Comment